ఖైరతాబాద్: సెప్టెంబర్ 30 (జనం సాక్షి) రెండు సంవత్సరాల క్రితం, యూట్యూబ్ భారతదేశంలో పార్టీ ను ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వడం, క్రియేటర్లకు ప్రేక్షకులను పెంచడంలో కొత్త వీడియో ఫార్మాట్ల ద్వారా ప్రేరణ పొందడంలో సహాయపడాలన్న తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లింది. దాని ప్రారంభం నుంచి, యూట్యూబ్ షార్ట్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల కంటే ఎక్కువ నెలవారీ లాగిన్ – ఇన్ వినియోగదారుల కమ్యూనిటీని పెంచిందని యూట్యూబ్ పార్ట్ నర్పివ్స్ ఏపీఏసీ రీజనల్ డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ మాట్లాడుతూ పార్ట్స్ మా క్రియేటర్లు, వ్యూయర్లకు యూట్యూబ్ అనుభవంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతినెలా 150 కోట్ల కంటే ఎక్కువ మంది లాగిన్ అయిన యూజర్లు వీటిని చూస్తున్నారని తెలిపారు. దీన్ని మరింత సృజనాత్మకంగా కొనసాగించడానికి ఎదురు చూస్తున్నామని చెప్పారు. యూట్యూబ్ మ్యూజిక్ పార్ట్ నర్పీపీ డైరెక్టర్ పవన్ అగర్వాల్ మాట్లాడుతూ యూట్యూబ్ లో ఆర్టిస్టులందరూ తమ సొంత మార్గాన్ని ఏర్పరుచుకోవడంలో సహాయపడటమే తమ లక్ష్యం అన్నారు.




