భారత స్వాతంత్ర వజ్రోత్సవ మహోత్సవము.
ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో,
– ఫ్రీడం రన్ కురవి, సీరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో,
– సంయుక్త ప్రకటన
కురవి ఆగస్టు-10 (జనం సాక్షి న్యూస్)
భారతదేశ స్వాతంత్రం సిద్ధించి 75 వ వసంతోత్సవాలలో భాగంగా ఆజాద్ కా అమృత్ వజ్రోత్సవం సందర్భంగా కురవి, సీరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సై రాము నాయక్, లావుడియా నరేష్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలియజేశారు.
దీ,11.08.2022 ఉదయం:6.00 గంటలకు ఫ్రీడమ్ రన్ ను సీరోలు సెంటర్ నుండి కాంపల్లి రూట్ లో యూ టర్న్ ఫ్రీడమ్ రన్ (2కె రన్), కురవి ఆలయం నుండి బయలుదేరడం జరుగును. జాతీయ జెండాను చేతబూని జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడుకుంటూ ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిరోల్, కురవి ఎస్సై లు తెలియజేశారు.
కావున ఈ కార్యక్రమానికి మండల అధికారులు,మండల ప్రజాప్రతినిధులు, జడ్పిటిసి, ఎంపీటీసీ లు,సర్పంచ్ లు , వార్డ్ సభ్యులు,యువకులు, క్రీడా కారులు, , వాకర్స్ అసోసియేషన్,వర్తక సంఘాలు, ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, మీడియా ప్రతినిధులు, ప్రతి ఒక్కరు టీ షర్ట్ షూస్ ధరించి ఫ్రీడమ్ రన్ లో పాల్గొనాలని కోరనైనది. ప్రతి పౌరుడు 75వ వజ్రోత్సవంలో పాల్గొని గర్వించేలా ఈ ఫ్రీడమ్ రన్ నిర్వహించి విజయవంతం చేయాలనని కోరనైనది