*75 వ స్వాతంత్ర మహోత్సవాన్ని పండగల జరుపుకోవాలి!

*ఎమ్మెల్యే సురేందర్
_________
లింగంపేట్ 10 ఆగస్టు (జనంసాక్షి)
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవాలు సాదాసీదాగ చేసుకోకుండా స్వాతంత్ర దినోత్సవ మహోత్సవాలను ఘనంగా పండుగల చేసుకోవాలని ఎమ్మెల్యే సురేందర్ అన్నారు.ఆయన బుధవారం లింగంపేట్ మండల కేంద్రంలోని రైతు వేధిక భవనంలో ఎర్పాటు చేసిన వజ్రోత్సవ సన్నాహక సమావే శానికి హాజరైనారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు.ఫ్రీడం రన్ తో పాటు రోజువారి కార్యక్రమాలను ఘనంగా జరుపుకోవాలన్నారు.ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు విద్యార్థులు ఉపాధ్యాయులు మహిళా సంఘాలు యువకులు పెద్ద ఎత్తున ఫ్రీడం రన్ లో పాల్గొనలన్నారు.నియమ నిబంధనలు పాటించి జాతీయ జెండాను ప్రతి కుటుంబం ఇంటి పై ఎగుర వేయాలన్నారు.స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నందున ఒక పెద్ద పండగ లాగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని పిలుపు నిచ్చారు.స్వాతంత్రం తెచ్చిన మహనీయులను స్మరించుకుంటు మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 22 వరకు జరుపు కోవాలని పేర్కోన్నారు.గాంధీ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలన్నారు.గ్రామకార్యదర్శులకు జెండాలను పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో వివిద శాఖల అధికారులు ప్రజాప్రతినిదులు సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.

తాజావార్తలు