Thursday, 5 November 2026

భారాసకు కార్యకర్తలే బలం

 

 

 

 

 

 

 

 

పార్టీ శ్రేణుల్లో చైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగుతాం

ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం దిశగా వివిధ కార్యక్రమాలు

పార్టీ శ్రేణుల సమాయత్తం, దిశా నిర్దేశనం

బీఆర్ఎస్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇన్ చార్జి ,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

 

మానకొండూరు, ఆర్ సి, మార్చి 15 (జనం సాక్షి)

రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు భారాసను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే లా అధిష్టానం పలు కార్యక్రమాలు రూపకల్పన చేసినట్లు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య చెప్పారు. పార్టీలోని కిందిస్థాయి కార్యకర్త , ప్రజా ప్రతినిధులు, రాష్ట్రస్థాయి నాయకులు అందరి మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులను ఏకం చేసేలా ఆత్మీయ సమ్మేళనాలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలల పాటు విస్తృతంగా చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని ఆయన వివరించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అమలు దిశగా పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖం చేసేందుకు కరీంనగర్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు తో కలిసి మానకొండూరులోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. పలు కార్యక్రమాల నిర్వహణ, అమలుపై పార్టీ శ్రేణులకు సమాయత్తం, దిశా నిర్దేశం చేశారు.పార్టీ కార్యక్రమాల ప్రణాళిక,అమలుపై చర్చించారు. సమావేశానంతరం పార్టీ ఇంచార్జి సారయ్య, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు లు మీడియాతో మాట్లాడారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్ గా తీసుకొని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని వారు తెలిపారు. జూన్ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభం నుండి పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని అధిష్టానం ఆదేశించిందని వెల్లడించారు . ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు .భారాస ను మరింత బలోపేతం చేసేందుకు, అన్ని గ్రామాలకు ప్రాతినిధ్యం ఉండేలా కార్యాచరణ ప్రణాళిక చేపట్టి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాల షెడ్యూల్ ను మీడియాకు వివరించారు.
ఏప్రిల్ 24 లోపు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమ్మేళనాలకు స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ స్థాయి సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థి సంఘాలు, సర్పంచులు, సింగిల్ విండో, మార్కెట్ కమిటీ చైర్మన్ లు తదితరులు హాజరవుతారని చెప్పారు .ఏప్రిల్ 14 న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాదులో విగ్రహావిష్కరణ మండల, జిల్లా స్థాయిలో వేడుకలు ఘనంగా జరుపుతామన్నారు. 25న గ్రామాలలో, నగర వార్డులలో పార్టీ జెండా ఆవిష్కరణ పండుగలా, వేడుకగా నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అధిక సంఖ్యలో సభ్యత్వ కార్యక్రమం చేపట్టి పార్టీని బలోపేతం చేయాలని వారు కోరారు. పార్టీ ఆదేశాలను అందరూ పాటించి పార్టీని పటిష్ట పరచాలని సూచించారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, భారాస మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ (మానకొండూరు), గంప వెంకన్న (గన్నేరువరం) గంట మహిపాల్ (శంకరపట్నం) రావుల రమేష్ (తిమ్మాపూర్ ) శ్యామ్ సుందర్ (కరీంనగర్ రూరల్ అధ్యక్షులు) కొలిపాక శ్రీను, (హుజురాబాద్ టౌన్) నవీన్,( గంగాధర) జితేందర్ రెడ్డి (రామడుగు),లోకా రాజేశ్వరరావు( చొప్పదండి), శ్రీనివాస్( కొత్తపల్లి) డాక్టర్ ఐలయ్య (హుజురాబాద్) నాయకులు శాతరాజు యాదగిరి, అడప శ్రీనివాస్, తదితరులు పార్టీ బాధ్యులు సమావేశానికి హజరయ్యారు.