భారి బహిరంగ సభ కు తరలి రావాలి

భాజపా మండలాధ్యక్షులు జకరయ్య

 

ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 14 ,(జనం సాక్షి)ఆగష్టు 18న జరగబోయే భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని బాజపా మండల అధ్యక్షులు బట్టు జకరయ్య అన్నారు. ఈ మేరకు మిచ్చమ్మ ఆశ్రమంలో మండల శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, బూత్ కమిటీ అధ్యక్షులు మండల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసారు.గురువారం నాడు కోరుట్ల లో జరిగే సభకు ,కార్యకర్తలు , ప్రజలు భారిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యలు తీగల శ్రీధర్ రెడ్డి ,జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ , జిల్లా కిషన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బాయ లింగ రెడ్డి , జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బండి గోపాల్ ,
బీజేవైఎం మండలం అధ్యక్షులు బోడ నవీన్ రెడ్డి , ఉపాధ్యక్షులు మహేందర్ , మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి నీరటి రవి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దాసరి రాజేందర్ , రమేష్ ,శిరీస్ , దినేష్ ,శేఖర్ శ్రీనివాస్ , జలంధర్ , భాస్కర్ మరియు బూత్ కమిటీల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.