Wednesday, 4 November 2026

భారీగా నగదు మాయం

నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీగా నగదు మాయమైంది. రూ. 30 లక్షలు చోరీ ఘటనలో కుటుంబసభ్యులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యుల వద్దే రూ. లక్షన్నరను పోలీసులు గుర్తించారు. పొలం అమ్మగా వచ్చిన సొమ్మును యజమాని ఇంట్లో ఉంచగా అది దొంగతనానికి గురైంది. నగదు మాయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *