Tuesday, 3 November 2026

భారీ వర్షం కారణంగా 50 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌ మండలంలోని బంగారుగూడ, అనుకుంట వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తలమడుగు మండలంలో సుంకిడీ వాగు ఉధృతితో అంతరాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జేనాథ్‌ మండలంలో భారీ వర్షానికి జైనాథ్‌, నీరాల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *