భారీ వర్షానికి పొంగిన పుణ్యపువాగు
అని శెట్టిపల్లి మర్కోడు మధ్యలో రాకపోకలు బంద్
టేకులపల్లి, జూలై 29( జనం సాక్షి) : శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. అని శెట్టిపల్లి నుండి మర్కోడు ప్రధాన రహదారి మధ్యలో గల పుణ్యపువాగు పొంగడంతో వరద ఉధృతికి వంతెన పైనుండి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు గంటలు తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల మూలంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పత్తి మొక్కజొన్న పంటలు నీట మునిగి ఎర్ర వారి తెగులు సంభవిస్తున్నాయి. మిర్చి నార్లు పోసుకున్న రైతులు నారుకుల్లుడు తెగులు సంభవిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.