భారీ వర్షాలకు నీటి కుంటకు బుంగ అనే కథనానికి స్పందించిన అధికారులు

జూలై 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లాలో కొత్తగూడ మండలంలోని కోనపురం గ్రామంలో ఉన్న తోట వారికుంటకు బుంగ పడడం జరిగింది.ఈ కథనం జనంసాక్షి దినపత్రిక లో ప్రచురితం చేయడంతో జిల్లా అధికారులు స్పందించి డిఈ చెన్నకేశవరెడ్డి,ఏఈ అనుష లు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామ సర్పంచ్ సావిత్రి రైతులు బొల్లం ఐలయ్య,వీరభద్రం,ఉపేందర్,మల్లయ్య, ఐలయ్యల సహాయంతో 40 బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు.అధికారులు మాట్లాడుతూ వర్షం తగ్గుముఖం పట్టాక జెసిబి సహాయంతో పూర్తిగా గండిని పూడ్చడం జరుగుతుందని తెలిపారు.రైతులు ఆనందాన్ని వ్యక్తపరిచారు.అనంతరం జనంసాక్షి పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రైతులు..