భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి

– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
(జనంసాక్షి) జులై 09 : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ సూచించారు. వాగులు, కాలువలు, నదులు రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళకూడదని, గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని, నీరు అత్యధికంగా ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్ళరాదని, నాలాలు, వాగులు ప్రవహిస్తున్న రహదారులు, రోడ్లు దాటరాదన్నారు. చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఉండరాదని, కరెంటు స్థంభాలు ముట్టుకోకూడదని, వర్షాలకు రహదారులు చిత్తడిగా ఉంటాయి కాబట్టి వాహనాలు నెమ్మదిగా నడపాలని, అవసరమైతే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని కోరారు.