భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపిన భర్త

 

జనంసాక్షి /చిగురుమామిడి – ఆగష్టు 15:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష 30 సంవత్సరాలు అనే మహిళను భర్త కనకం ప్రవీణ్ కత్తితో పొడిచి దారుణంగా చంపిన ఘటన సోమవారం చోటచేసుకుంది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం శిరీష అంగన్వాడి సెంటర్ లో ఆయమ్మగా పనిచేస్తుంది. జాతీయ జెండా ఎత్తిన అనంతరం భర్త ప్రవీణ్ శిరీష ను అంగన్వాడి సెంటర్ నుండి లాక్కెళ్లి కత్తితో మెడ భాగంలో, మెడ వెనక భాగంలో పొడవగా మృతురాలు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. మృతురాలికి 10 సంవత్సరాల క్రితం నేరస్తుడు ప్రవీణ్ తో పెళ్లి జరుగగా వారికి ఒక కుమార్తె.శరణ్య(9), కుమారుడు.శశివర్దన్ (7) ఉన్నారు. కాగా మృతురాలి తండ్రి అరేపల్లి రవి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ దాస సుధాకర్ పరిశీలించారు.