Wednesday, 4 November 2026

భార్యాపిల్లల హత్య కేసు వ్యక్తి దారుణహత్య

 

 

హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): విూర్‌పేట పరిధి జిల్లాలగూడలో బుధవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హరీందర్‌ అనే వ్యక్తిని గొంతు కోసి చంపారు. ఆర్నెళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లల హత్య కేసులో హరీందర్‌ నిందితుడిగా ఉన్నాడు. భార్యాపిల్లలను చంపిన కేసులో అతనిపై కుటుంబ సభ్యులు ఆగ్రుహంగా ఉన్నారని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.