హైదరాబాద్,జూలై25(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైర్ అయ్యారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో విూడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నష్టం చేయాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్లమెంట్‌లో ఆంధ్రా పక్షపాతాన్ని బయటపెట్టారని కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఏపీపైనే ప్రేమ ఉందని చెప్పడంతో కాంగ్రెస్ వైఖరి బహిర్గతమైందని అన్నారు. ఆజాద్ వ్యాఖ్యలపై ఉత్తమ్ సమాధానం చెప్పాలని కర్నె డిమాండ్ చేశారు. తెలంగాణను ఎండబెట్టి ఏపీకి మేలు చేయడమే కాంగ్రెస్ విధానం అంటూ ఆయన మండిపడ్డారు. విభజన చట్టంలోని హావిూలు అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని, పరిధి దాటి ముందుకెళితే ప్రతిఘటిస్తామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విభజన చట్టంలోని హావిూలు.. తెలంగాణ హక్కుల గురించి ఆపార్టీ ఎందుకు ప్రస్తావించ లేదన్నారు.. తెలంగాణకు రావాల్సిన హక్కులపై కాంగ్రెస్ నాయకులు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హావిూలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




