Wednesday, 4 November 2026

కార్ఖానాలో ప్లాట్‌లో వ్యభిచారం

దాడి చేసి పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పాత వాసవీనగర్‌లోని ఓ ప్లాట్‌లో ఈ దందా సాగిస్తున్నారు. ఈ సోదాల్లో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులు, ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిషాకు చెందిన ఓ యువతిని రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న సమయంలో దాడి చేసి ఆమెను రక్షించారు. వారి వద్ద నుంచి రూ. 13వేల నగదుతో పాటు ఆరు మొబైల్‌ లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.