Thursday, 5 November 2026

భార్య పేరు కాల్‌గర్ల్స్‌ లిస్టులో పెట్టాడు…అరెస్ట్ అయ్యాడు

హైదరాబాద్: కట్టుకున్న భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించిన దుర్మార్గపు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె ఫోన్ నంబర్ ను కాల్ గాల్ వెబ్ సైట్ లో పెట్టాడు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడు మురళీకృష్ణ అకృత్యాలను అతడి భార్య భాగ్యలక్ష్మి మీడియాకు వివరించింది. ప్రేమ పెళ్లి చేసుకుని తనకు నరకం చూపించాడని బాధితురాలు వాపోయింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న మురళీతో 2002లో తన పెళ్లి జరిగిందని తెలిపింది. ప్రేమించానని చెప్పి పెళ్లికి కోటి రూపాయలు కట్నం అడిగాడని, చివరకు రూ. 10 లక్షలు కట్నం తీసుకున్నారని వెల్లడించింది.

పెళ్లైననాటి నుంచి తనను వేధింపులకు గురిచేశారని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి వాపోయింది. తనకు న్యాయం చేయాలని, తనలా మరో అమ్మాయి మోసపోకూడదంటే అతడిని జైల్లోనే ఉంచాలని కోరింది. అయితే తన కొడుకు అమాయకుడని మురళీకృష్ణ తల్లి తెలిపింది. మురళీ కృష్ణ నివాసం నుంచి ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *