Monday, 2 November 2026

భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి

 

 

 

వేములవాడ రూరల్, జనవరి 30 జనం సాక్షి : తమ సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరి 1 నుండి పాఠశాలలో 9,10 తరగతి విద్యార్థులకు తెలుగు,హిందీ బోధించబోమంటూ RUPP TS జిల్లా అధ్యక్షులు జనపాల వెంకటయ్య ఆధ్వర్యంలో వట్టెంల ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని, లేనిపక్షంలో జాక్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా తరగతులు బోధించడం జరగదు అన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.