భువనగిరి ఖిలా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు.

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన నాయకులు.

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–పాపన్న పాలించిన ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలకు రాజకీయంగా ,ఆర్థికంగా సమా న్యాయం జరిగినప్పుడే పాపన్న అశయం నేరవేరుతుందిని పంజాల జైహింద్ గౌడ్ అన్నారు.నేడు సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి సందర్బంగా భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిలా వద్ద ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు.300 సంవత్సరాలకు ముందు మెగలు సామ్రాజ్యంలో సమాజంలో దోపిడీ,జమీందారి భూస్వామ్య వ్యవస్థలపై పోరాడి సోంత సైన్యం ఏర్పాటు చేసి ఖిల షాపూరం కేంద్రంగా సామాన్యుడు సైతం రాజ్యం ఏలి పాలించవచ్చని నిరూపించన తొలి బహుజన రాజు పాపన్న అని ఆయన కోనియాడారు.ఈ కార్యక్రమంలో సినిహీరో పంజాల జైహింద్ గౌడ్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర బంజారా శ్రావణ్ గౌడ్ భువనగిరి నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ నాయకులు పంజాల రామాంజనేయులు, గౌడ్ క్యూ న్యూస్ చైర్మన్ తీన్మార్ మల్లన్న, హరి శంకర్ గౌడ్. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాహంగీర్ , నాయకులు పోట్టోల్ల శ్యామ్, సూర్వి వేణు కాసుల అంజనేయులు, ముద్దగోని రామ్మోహన్ గనగాని మల్లేష్,బత్తిని రాజు గోదా శ్రీనివాస్ గౌడ్ రాహుల్ గౌడ్,బుయ్య కిరణ్ ,తదితరలు పాల్గొన్నారు.