Tuesday, 3 November 2026

భువనగిరి పురపాలక సంఘ కౌన్సిలర్లు హక్కులను కాలరాస్తున్న చైర్మన్ కమిషనర్లపై న్యాయపరమైన చర్యలకు సిఫారసు చేయండి

 

 

 

 

 

 

అప్పురూపకంగా తెచ్చిన టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో చేస్తున్న పనులపై నిజనిధారణ చేయించండి

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని కలిసిన భువనగిరి కౌన్సిలర్లు బృందం
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–

భువనగిరి పురపాలక సంఘంలో జరుగుతున్న సభ హక్కుల ఉల్లంఘన అంచనాలు లేకుండా సాంకేతిక అనుమతులు పొందకుండా టి యు ఎఫ్ ఐ డి సి అప్పు 16,50 లక్షల రూపాయలతో ప్రజా ఉపయోగం లేని ప్రజా ధన దుర్వినియోగంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తో పనుల నాణ్యత పరిమాణాలపై సీనియర్ సివిల్ ఇంజనీర్లతో విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలని మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం ఈరోజు భువనగిరి పట్టణానికి విచ్చేసిన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా న్యాయవాది పి, నిరుప్ గారిని సీనియర్ సివిల్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ మరియు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గార్లను కలిసి భువనగిరి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ పాలకపక్ష చైర్మన్ మున్సిపల్ కమిషనర్ వీళ్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నియమ నిబంధనలకు త్రిలోధ కాల్ ఇచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా ప్రతినిధులుగా గెలుపొందిన కౌన్సిలర్ల ను నిర్లక్ష్యం చేస్తూ వాళ్లను అగర్వపరుస్తూ శాసనం మీద ప్రమాణం చేసిన స్థానిక శాసనసభ్యుడు పక్షపాత ధోరణితో ఏకపక్షంగా మున్సిపల్ కు అప్పుగా తీసుకువచ్చిన ప్రజలపై భారం మోపే ప్రజాధనాన్ని ప్రజలకు ఉపయోగపడనవి అనాలోచితంగా ఆవేశపూరితంగా చేపడుతున్న పనుల ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి సభ హక్కులను ఉల్లంఘిస్తూ గౌరవ ప్రజా ప్రతినిధులను నిర్లక్ష్యం చేస్తూ ఆప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి వ్యవహారాలు నిజ నిర్ధారణ చేసి చట్టపరంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడడానికి న్యాయబద్ధంగా చట్టపరమైన హక్కులను కాపాడాలని కోరడం జరిగింది*ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి భువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ పడిగెల రేణుక ప్రదీప్ ప్రజా సంఘాలు నాయకులు బట్టు రామచంద్రయ్య ఆనందం పిట్టల బాలరాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.