భూదాన్ భూములను పేదలకు పంచాలి- సిపిఎం మండల కార్యదర్శి వట్టెపు సైదులు.
*మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)
మండల కేంద్ర పరిధిలోని సర్వే నెంబర్ 1057లో గల 150 ఎకరాల భూదాన్ భూములను పేదలకు పంచాలని సిపిఎం మండల కార్యదర్శి వట్టెవు సైదులు అన్నారు. మంగళవారం భూదాన్ భూములను సిపిఎం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. పేదల భూములను పరిశీలించేందుకు వెళ్లిన సిపిఎం నాయకులను మైహోం సంస్థ అడ్డుకొని అక్కడి నుంచి వెళ్లగొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైహోమ్ అక్రమాలకు అంతులేకుండా పోయిందని పేదల భూములను దర్జాగా కబ్జా చేసి, ఇటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం పేదల భూములపై కాపాడుకుంటే సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎటువంటి అనుమతులు లేకుండా మైహోం సంస్థ నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని బడాబాబుల కబ్జాలో ఉన్న భూములను ప్రభుత్వం పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుడు సైదులు ఆదినారాయణ నరసింహరావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.