Wednesday, 4 November 2026

భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి మహోత్సవానికి భారీ ఆర్థిక విరాళం అందించిన  యఫ్ టీవీ ఫౌండర్ పాడి ఉదయ్ నందన్ రెడ్డి

 వీణవంక జూన్ 7 ( జనం సాక్షి)వీణవంక  మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న ఈరోజు నుండి మూడు రోజుల వరకు మల్లారెడ్డిపల్లి గ్రామంలో  భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి  దుర్గమ్మ మరియు పాఠశాలల్లో సరస్వతి దేవి గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవము కార్యక్రమాలకు    మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి   గ్రామ ప్రజలు  తమ గ్రామంలో జరుగునున్న శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, జరగబోయే మహోత్సవ కార్యక్రమానికి ఆర్థిక సహాయం పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి కోరగా తన వంతుగా ఆ గ్రామానికి   వెంటనే భారీ ఆర్థిక సహాయంను యఫ్ టీవీ ఫౌండర్ పాడి ఉదయ్ నందన్ రెడ్డి .    మహోత్సవ కార్యక్రమానికి 51.116 రూపాయలను వారి ఆదేశాల మేరకు భారీ విరాళంగా బుధవారం రోజున తన అనుచరులతో అందజేశారు అలాగే మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే మా గ్రామంలో జరగనున్న శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, దుర్గమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాప న మహోత్సవ భారీ ఆర్థిక సాయం అందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డికి
మా పక్షాన మా గ్రామ ప్రజల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.    ఈ కార్యక్రమంలో  మల్లారెడ్డిపల్లి   గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ ముద్దసాని బిక్షపతి. మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్. వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్. కర్ర నాని. దూలం సమ్మయ్య.కొలిపాక శ్రీనివాస్. అమృత ప్రభాకర్ నారాయణ,శ్రీధర్ పల్లెర్ల కిరణ్. దూలం సురేష్. చిన్నాల శ్రీకాంత్. వంశీ సిరిగిరి రాజేష్. దసారపు లోకేష్, , సిరిగిరి రాజశేఖర్, సాయి. ఓంకార్ మల్లారెడ్డి పల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు