భూ కబ్జాపై కలెక్టర్ కు ఫిర్యాదు
డోర్నకల్ జూలై 15 జనం సాక్షి
తమ కుటుంబ సమిష్టి ఆస్తిని ఏకపక్షంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అంకతి వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం రెవిన్యూ 540,565,542 లోని అనుబంధంగా ఉన్న 2.10 గుంటల తన తండ్రి భూమిని ఆయన వృద్ధాప్యంలో ఆలనా పాలన సూచుట నిమిత్తం 1.10 గుంటల భూమిని పెద్ద మనుషుల సమక్షంలో పద్మకు కేటాయించారు.మిగులు భూమిని అన్నదమ్ముల ఇరువురికి సమానంగా పంపిణీ జరగవలసి ఉన్నప్పటికీ ఎవరికి తెలియకుండా కోటేశ్వరరావు స్వాహా చేసేందుకు తప్పుడు దస్తావేజుల సృష్టించి రెవిన్యూ కార్యాలయం ద్వారా పట్టా తీసుకున్నారని ఆరోపించారు.ఈ తప్పుడు పట్టా విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు.ఇందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను వేడుకున్నారు.