Thursday, 5 November 2026

భూ సవిూకరణపై హైకోర్టులో రైతుల పిటిషన్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
: ఏపీ రాజధానికి భూ సవిూకరణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బలవంతంగా భూములు
సేకరిస్తున్నారని గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు.
ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని ఏజీకి హైకోర్టు సూచించింది.ల్యాండ్‌ పూలింగ్‌ను  వ్యతిరేకిస్తున్న
ఆంధప్రదేశ్‌ రాజధాని ప్రాంత రైతులుఈ మేరకు  హైకోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం
పిటిషన్‌ను  పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ అడ్వకేట్‌ జనరల్‌ను  హైకోర్టు ఆదేశించింది. కాగా ల్యాండ్‌ ఫూలింగ్‌ నుంచి తమను విముక్తి చేయాలంటూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన 32మంది రైతులు కోర్టులో పిటిషన్‌ వేశారు.  క్లాస్‌ 22 సెక్షన్‌ 2(52) ఆఫ్‌ సీఆర్‌డీఏ చట్టం ప్రకారం స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకోవాలని.. బలవంతంగా భూములు లాక్కొనే పరిస్థితి సర్కార్‌ తెచ్చిందని రైతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే ఏపీ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌కు  తాము వ్యతిరేకమంటూ ఇప్పటికే సీఆర్డీఏకు అభ్యంతర ఫారాలు (9.2) రైతులు ఇచ్చారు. ఆ అభ్యంతర ఫారాలు ఇచ్చిన 15 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉన్నా…ఇప్పటికీ సర్కార్‌ స్పందించలేదు. 9.2 ఫారాలు ఇచ్చిన రైతులకు ల్యాండ్‌ పూలింగ్‌తో  సంబంధం లేదంటూ సీఆర్డీఏ నిబంధనల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అభ్యంతర ఫారాలు ఇచ్చి నెల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవటంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *