భైంసా బస్టాండ్ నందు ప్రహరీ గోడ కు భూమి పూజ చేసిన అదిలాబాద్ జిల్లా రీజియన్ మేనేజర్ సోలోమాన్ రాజు
భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు31 తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భైంసా డిపో పరిధిలోని ముధోల్ బస్టాండ్ నందు ప్రహారి గోడకు గురువారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజియన్ మేనేజర్ సొలొమాన్ రాజు భూమి పూజ చేయడం జరిగినది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రహారి నిర్మాణం గురువారం రోజు భూమి పూజ చేయడం జరిగినది. డిపో మేనేజర్ యం. అమృత మాట్లాడుతూ ప్రహారి గోడ లేకపోవటం వలన పశువులు, ప్రైవేట్ వాహనాలు, కుక్కలు బస్టాండ్ లోపలికి విచ్చల విడిగా వచ్చేవి. రాత్రి ప్రయాణికులు బస్టాండ్ కి రక్షణ లేక ఇబ్బంది పడే వారు ఈ ప్రహారి నిర్మాణం వలన ప్రయాణికులకు ఉపయోగ కరంగా ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో రీజియన్ మేనేజర్ సొలొమాన్ రాజ్,డిపో మేనేజర్ యం. అమృత, DE ఆంజనేయులు, స్టేషన్ మేనేజర్ బోజా గౌడ్ మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.