సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– సర్పంచ్ అల్లూరి విజయవాసురాజు.
కురివి జులై –
(జనం సాక్షి న్యూస్)
కురవి మండలం నారాయణపురం గ్రామంలో సర్పంచ్ అల్లూరి విజయ వాసు రాజు ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం నందు అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ….. గ్రామంలో అధిక వర్షములు పడడం వల్ల గ్రామంలో నిలువ నీటి గుంటలు లేకుండా, సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీధి దీపాలు, పారిశుధ్యం, కరోనా బూస్టర్ ఇంజెక్షన్ అందరికీ వేయించే విధంగా కమిటీ బాధ్యత వహించాలని ప్రకృతి సహజంగా వచ్చే ప్రమాదాలను అరికట్టుటకు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాస్కర్, గ్రామ కార్యదర్శి మవీన్ , ఎంపీటీసీ అర్జున్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area