మండలంలో కుండపోత వర్షం

పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు,చెరువులు

జనంసాక్షి/రేగోడ్

మండల వ్యాప్తంగా కుండపోత వర్షాలతో వాగులు,వంకలు,చెరువులు పొంగిపొర్లుతున్నాయి. శనివారం నాడు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జగిర్యాల,కొండాపూర్ చెరువు అలుగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.అలుగు పారుతున్న దృశ్యాలు చూడడానికి ప్రజలు జగిర్యాల, కొండాపూర్ నుంచే కాకుండా ఇతర గ్రామాల నుండి తండోపతండాలుగా వచ్చి తిలకించారు.అల్లాదుర్గం-రేగోడ్ దారిగుండా ప్రయానించే ప్రయాణికులు,వాహనదారులు వెళ్లకుండా వేరే రూట్లో వెళ్లాలని రేగోడ్ పోలీసులు సూచించారు.ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని ప్రజలు అప్రమతంగా ఉండాలని రేగోడ్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.