మండల కేంద్రంలో ఘనంగా చిన్న పీర్ల పండుగా వేడుకలు

చౌడాపూర్,ఆగస్టు 25( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపల్,వీరాపూర్,చౌడాపూర్ గ్రామాలలో చిన్న పీర్ల పండుగా కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఎంతో అట్టహాసంగా,ఘనంగా నిర్వహించారు.మొహర్రం పండుగ అనగానే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కలిసి  ఆటపాటలతో, డప్పు వాయిద్యల మధ్య వివిధ గ్రామాల ప్రజలు ఎంతో ఉత్సవంగా పీర్ల పండుగను జరుపుకుంటారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి శంకర్,వార్డ్ మెంబర్స్ అశోక్,యదయ్య,రాజు,లక్ష్మయ్య, గౌస్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.