Tuesday, 3 November 2026

మండల కేంద్రంలో దర్జాగా అమ్ముతున్నా నిషేదిత వస్తువులు…

వీర్నపల్లి ఏప్రిల్ 27(జనంసాక్షీ):-
వీర్నపల్లి మండల కేంద్రంలో ఉన్న కిరాణ దుకాణదారులు నిషేదిత  అంబర్లు గుట్కాలు
బెల్లం పట్కిలు  రహస్యం అమ్ముతున్నారు. నిషేదత వస్తువుల అమ్మడు తీరు ,ఒక వింతా తినే వారికి మాత్రమే అర్థం అయ్యేటట్లు ‘భూష్టు’అంటూ బహిరంగగా అమ్ముతున్నారు.వ్యవసాయ అధారిత
వస్తువులు అమ్మే దుకాణాలలో ఒక నెల రోజుల క్రితం అగ్రికల్చర్ అఫీసర్ ,స్థానిక యస్ ఐ గార్లు తనిఖీ నిర్వహించి నకిలీ విత్తనాలు నకిలీ రసాయన మందుల గురించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.ఛెకింగ్క్ వాళ్ళు వస్తూన్నారు అని ముందే తేలసుకోవడం జగ్రత్త ముందే పడిపోవడం జరుగుతున్నారని ప్రజలు అంటున్నారు. విత్తనాలు, పర్టిలైజర్ ,మెడికల్ సాఫ్ లో అమ్మే మందులలో జాగ్రత్తగా తనిఖీ చేస్తే ఆశ్చర్యపోయే నీజాలు భయటకు వస్తాయని స్తానికులు అంటున్నారు. నిన్న రాత్రి స్తానిక కిరాణం దుకాణం లో యస్ ఐ సురేందర్రెడ్డి అకస్మాత్తిగా సోద నిర్వహిస్తే 40 అంబర్ల ప్యాకేట్లు దోరకడం జరిగింది. దానితో అతని పై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్
ఇవ్వడం జరిగిందని  యస్ ఐ చేప్పడం జరిగింది. ఒక్కసారి అలోచించడి ఈ దుకాణం ముందు నుండి అదికారుల యంత్రాంగం తిరుగుతున్న దర్జాగా అమ్ముతున్నా,అక్కడ అమ్ముతున్నటు తేలియదు ,దృష్టి పెట్టి సోదాలు జరిపితే విషయం బయట పడింది. ఇదే మాదిరిగా మెడికల్ సాఫ్
పైన ,నకిలీ విత్తనాలు పైన నిషేదిత వస్తువులపైన
సంబంధించిన అదికారులు స్తానిక యస్ ఐ తో తనిఖీ చేస్తే నిజాలు బయటకు వస్తాయని ప్రజల చేబుతున్నారు.ప్రజల ఆరోగ్యంతోను ప్రజల బ్రతుకులతోను ,జీవితాలతో చేలగాటం ఆడే వారి పైన కఠిన మైన చర్యలు తీసుకుంటేనే అవి తగ్గే అవకాశం ఉంటాయని ,అదికారులే కోమ్ముకాస్తే అది మారదనీ ప్రజల అంటున్నారు. అదికారులు నిజాయితీ ఉండి ప్రజలని కాపాడాలని ప్రజల కోరుతున్నారు.