మండల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు

భారీగా తరలి రావాలని పిలుపు

సభాస్థలిని పరిశీలించిన భారాస జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి

సిరోల్ మండలం అక్టోబర్-16
(జనం సాక్షి న్యూస్)

డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేపు ఉదయం 11:00 గంటలకు నూతనంగా ఏర్పడిన సీరోల్ మండల రెవెన్యూ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం..ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత డోర్నకల్ శాసన సభ్యులు డిఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు,మహబుబాబాద్ పార్లమెంటు సభ్యులు మాలోత్ కవితమ్మ,జిల్లా కలెక్టర్ హాజరు కానున్నారు. సీరోల్ మండల నూతన 17 గ్రామాల ప్రజలు నాయకులు, కార్యకర్తలు,కురవి మండల ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు,హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు..ఈ కార్యక్రమంలో భారాస రాష్ట్ర యూత్ నాయకులు గుగులోత్ రవినాయక్, తహశీల్దార్ ఇమ్మాన్యువేల్, స్థానిక సర్పంచ్ శ్యామల రంగమ్మ,సీరోల్ యంపిటిసి భోజ్యనాయక్,వెడవెల్లి హర్షవర్థన్ రెడ్డి,భారాస మండల నాయకులు తోట రమేష్,మోహన్ రెడ్డి, పెద్ద బోయిన శ్రీశైలం యాదవ్,బానోత్ గణేష్,మాజీ సర్పంచ్ వేమిశెట్టి రంగయ్య,నాగయ్య, అధికారులు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.