Sunday, 8 November 2026

మండల రజక రిజర్వేషన్ సమితి ఎన్నిక ఏకగ్రీవం

 చింతలపాలెం — జనంసాక్షి
 సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండల కేంద్రంలో రజక రిజిస్ట్రేషన్ సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుడేపు నాగలింగం అద్యక్షతానా చింతలపాలేo మండల రజక రిజర్వేషన్ సమితి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడుగా దొండపాడు గ్రామానికి చెందిన తిరుమలగిరి మధుబాబు,ఉప అధ్యక్షుడుగా పరిమి వెంకటేశ్,ప్రధాన కార్యదర్శి హసన్నాబాద్ హనుమంతరావు,మండల విద్యార్ది విభాగం అధ్యక్షుడుగా పూసపాటి వెంకట్రావు, మండల మహిళా అధ్యక్షురాలుగా వేముల సీతామహాలక్ష్మిని ఎన్నుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో సూర్యపేట జిల్లా ఇంచార్జీ బూతరాజు వెంకటేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లన సత్యనారాయణ,కార్యవర్గ సభ్యులు సోమశేఖర్,బుతరాజు రామలింగo,ఉల్లెందు వెంకటేశ్వర్లు మరియు చింతలపాలేo మండల అన్ని గ్రామాల రజకులు పాల్గొన్నారు.
Attachments area