Sunday, 8 November 2026

సూరారంలో చేతబడి కలకలం

మహదేవపూర్, జనంసాక్షి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో చేతబడి కలకలం ప్రజలను భయ భ్రాంతులకు దారి తీస్తుంది. వివరాల్లోకి వెళితే సూరారం గ్రామానికి చెందిన వడ్లకొండ దుర్గమ్మ, వడ్లకొండ మధునక్క నివసిస్తున్న ఇంటి ముందు చేతబడి చేసినట్లు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గవ్వలు లాంటి ఆనవాళ్లు ఉండటంతో స్థానిక ప్రజలు భయాందోలనకు గురి అవుతున్నారు. వడ్లకొండ మధునక్క తెలిపిన వివరాల ప్రకారం తన ఇంటికి సమీపంలో కొంత స్థలాన్ని తీసుకోవడం జరిగిందని, ఆ స్థలం మాది అని కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కూడా వచ్చి వివరాలు రాసుకొని వెళ్లిపోయారు కానీ శాశ్వత పరిష్కారం చూపలేదని తెలిపింది. వడ్లకొండ మధునక్క కొనుగోలు చేసిన స్థలం తమదే అంటున్న సదరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడటం, ఇపుడు ఇంటిముందు చేతబడి ఆనవాళ్లు ఉండటంతో ఆ వ్యక్తులే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. వాళ్లతో ప్రాణభయం ఉండటంతో పక్కింటి వాళ్లతో ఉంటున్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.