Tuesday, 3 November 2026

మండల వ్యవసాయ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం.

 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్ తెలుసుకొని ఉదయం మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన కొద్దిసేపటికి అది కింద పడిపోయిన ఎవరూ పట్టించుకోవడం లేదు దీంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి జాతీయ పతాకానికి అవమానం జరిగిన అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పథకాన్ని నిర్లక్ష్యంగా వదిలివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు