Tuesday, 3 November 2026

మంత్రిని కలిసిన అంగన్‌వాడీలు

హైదరాబాద్‌,మార్చి8(జనం సాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర అంగన్‌ వాడీ ఉద్యోగులు, యూనియన్‌ నాయకులు నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి చాంబర్‌ లో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. అంగన్‌ వాడీల కోసం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా చేయని విధంగా వేతనాలు పెంచారని, గౌరవం కల్పించారని మంత్రి చెప్పారు. ప్రభుత్వ నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు.