Tuesday, 3 November 2026

మహిళలను నిత్యం గౌరవించుకునే దేశం మనది

పోలీస్‌ శాఖలో కీలకంగా మహిళా సిబ్బంది
స్టేషన్లలో వారికి అన్ని వసతులు కల్పిస్తున్నాం
మహిళాదినోత్సవ వేడుకల్లో మంత్రి మహ్మూద్‌ అలీ
పోలీస్‌ శాఖలో మహిళలు ఉత్సాహంగా చేరుతున్నారన్న సిపి
హైదరాబాద్‌,మార్చి8(జనం సాక్షి): పోలీస్‌ శాఖలో మహిళా సిబ్బంది పాత్ర కీలకమని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మంగళవారంఎస్‌హెచ్‌ఓ నియమించిన మధులతకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈసందర్భంగా హోంమంత్రి విూడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇండియాలో ప్రతీ రోజు ఉమెన్స్‌ డేనే… మన దేశంలో మహిళలను గౌరవించుకుంటాం… ఫారెన్‌ కంట్రీస్‌లో అలా ఉండదు… వారి సంఖ్య కూడా పెరిగింది.. అన్నీ పోలీసుస్టేషన్లలో మహిళా సిబ్బందికి అన్నీ వసతులు కల్పిస్తున్నాం. వాష్‌, ఫీడ్‌ రూమ్స్‌, డ్రెస్సింగ్‌ రూమ్స్‌ కట్టిస్తున్నాం. మహిళలు అన్నీ రంగాలలో పైకి రావాలి. సీఎం కేసీఆర్‌ ఏ పథకంలో అయిన మొదటి ప్రాధాన్యం మహిళలకే ఇస్తున్నారని హోం మంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు.
తెలంగాణ పోలీస్‌ ఇండియాలోనే నెంబర్‌ వన్‌గా ఉంది. తెలంగాణ ప్రజలకు పోలీస్‌ విూద నమ్మకం భరోసా ఉంది అంటే వాళ్ల పని తీరుకు నిదర్శనం. మన దగ్గర నెంబర్‌ వన్‌ లా అండ్‌ ఆర్డర్‌ ఉంది. షీ టీమ్స్‌, భరోసా సెంటర్స్‌, మహిళల భద్రత కోసం అద్భుతంగా పని చేస్తున్నాయి. మహిళ పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారు. మహిళలు రక్షణ రంగంలో కూడా దూసుకెళ్తున్నారు. రోజూ మహిళలను గౌరవిస్తేనే, ప్రతీ రోజు ఉమెన్స్‌ డే నే అవుతుందని హోం మంత్రి మహమూద్‌ అలీ వ్యాఖ్యానించారు.
అన్నీ రంగాల్లో మగ వారితో సమానంగా మహిళలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. డైనమిక్‌ సీఎం దొరకడం మన అదృష్టం.. గాడ్‌ గిప్ట్‌…రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళా రక్షణ, అద్భుతంగా ఉంది. మొదటిసారి మహిళను ఎస్‌హెచ్‌ఓగా నియమించడం సిటీ పోలీస్‌ శాఖలో శుభ పరిణామం అన్నారు. హైదరాబాద్‌లో అన్నీ రకాల సంప్రదాయాలు ఉన్నాయి, సిటీ పోలీస్‌ పని తీరు వల్ల అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి.. సీఎం కేసీఆర్‌ పోలీస్‌ శాఖకు హై టెక్నాలజీ వాహనాలు ఇచ్చారు. డయల్‌ 100కు కాల్‌ చేసిన వెంటనే పోలీసులు వస్తున్నారని హోం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.
నగర పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోం మంత్రి మహమ్మద్‌ అలీ, సీపీ సీవీ ఆనంద్‌, అడిషనల్‌ సీపీ సిట్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌, డీసీపీ చందనా దీప్తి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్‌ మాట్లాడుతూ మహిళా అధికారులను చూసి గర్వపడుతు న్నానన్నారు. అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరుగుతోందని తెలిపారు. యుద్ధరంగంలో కూడా మహిళలు పాల్గొనే స్థాయికి ఎదిగారని అన్నారు. మహిళల పాత్ర గురించి సినిమాల్లో బాగా చూపిస్తున్నా రని… ఈమధ్య కాలంలో మహిళల ప్రాధాన్యతపై మంచి సినిమాలు వచ్చాయన్నారు. సినిమాలు చూసి చాలా మంది మహిళలు ఇన్స్‌పైర్‌ అయి పోలీస్‌ యూనిఫామ్‌ వేసుకుంటున్నారని ఆయన తెలిపారు. పోలీస్‌ విధులు కత్తివిూద సాము లాంటిదన్నారు. మహిళలకు కుటుంబ పరంగా అందించే అన్ని సహకారాలు డిపార్ట్‌మెంట్‌లో అందించాలనేది తన ఆలోచన అని తెలిపారు. మహిళలు జీడీపీలో కూడా భాగం పంచుకుంటున్నారని చెప్పారు. స్వతంత్ర హక్కులు మహిళలకు కల్పించాల న్నారు. రాష్ట్రంలో 700 పోలీస్‌ స్టేషన్‌లు ఉంటే మూడిరటిలో మాత్రమే మహిళా ఎస్‌హెచ్‌వోలు ఉన్నారని చెప్పారు. 170
సంవత్సరాలు చరిత్ర ఉన్న హైదరాబాద్‌ పోలీస్‌ విభాగంలో మహిళా ఎస్‌ఎచ్‌ఓలు లేరని… దీంతో మొట్టమొదటి మహిళ ఎస్‌ఎచ్‌ఓను లాలగూడా పీఎస్‌లో నియమించామని సీపీ తెలిపారు.
పోలీసు స్టేషన్‌లో కేవలం 60 శాతం మాత్రమే మహిళలకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజనకు ముందు 20 శాతం ఉంటే విభజన అనంతరం పరిస్థితులు మెరుగు పడ్డాయని చెప్పారు. పని ప్రదేశంలో అసమానతలు ఉండకుండా ఉండాలన్నారు. దేశంలో ప్రతి ఎయిర్‌ పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారులు సంఖ్య ఎక్కువగా ఉంటోందని అన్నారు. సీఐఎస్‌ఎఫ్‌ మహిళా పోలీస్‌ అధికారులను స్ఫూర్తిగా తీసుకుని… ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలని సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. ఇకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్‌ అధికారులు సీపీ సీవీ ఆనంద్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 1200 మంది మహిళా సిబ్బందికి ఈరోజు సాయంత్రం జీవీకే మాల్‌లో పవర్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘భీమ్లా నాయక్‌‘ సినిమాను ఫ్రీ గా చూసే అవకాశాన్ని సీపీ ఆనంద్‌ కల్పించారు. దీనిపై మహిళా పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.