మంత్రిని కలిసిన పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్
– జనంసాక్షి
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వదేశానికి విచ్చేసిన సందర్బంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూల బొకే, శాల్వతో మంత్రిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు పప్పుల ఆంజిరెడ్డి, పాశం బుచ్చి యాదవ్, బొడిగే కృష్ణా గౌడ్, కోఆప్షన్ మెంబర్లు రాందాస్ గౌడ్, ఇర్ఫన్, జావీద్, చెరుకు పెంటయ్య గౌడ్, జగదీశ్వర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.