సామాజిక సేవలో ముందుండే వ్యక్తి నారాయణ గుప్తా * మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 14:: సామాజిక సేవలో తానున్నానంటూ ఆదుకునే వ్యక్తి తూప్రాన్ మున్సిపల్ 16 వవార్డు కౌన్సిలర్ ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి నారాయణ గుప్తా వందేళ్లు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ లో నారాయణ గుప్తా జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి శాలువతో ఆయన సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలో పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకున్న వ్యక్తిగా తూప్రాన్ ప్రజల మన్ననలు పొందాడని అన్నారు ఆర్యవైశ్య సంఘంలో అంచలంచలుగా ముఖ్య నాయకునిగా ఎదిగి ఐ వి ఎఫ్ రాష్ట్ర కుశాధికారిగా సేవలు అందిస్తున్నారని అన్నారు అంచలంచలుగా ఎదిగి ఉన్నత పదవులు పొందాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుండే వ్యక్తి నారాయణ గుప్తా అని అన్నారు రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్నా అంటే నేనున్నానని అంటూ సేవ చేయడంలో ఆయనే ముందుంటాడని అన్నారు ఆయన సేవలు కేవలం తూప్రాన్ మండలంకు గాక మనోహర బాద్ శివంపేట మండలాలకు ప్రజలకు పలు సేవలు అందించారని సేవలు చేసేవారి కి ప్రజలలో గుర్తింపు ఎప్పుడు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు హరికృష్ణ పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి వైస్ చైర్మన్ దీపక్ రెడ్డి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ మండల సర్పంచ్ల పురం అధ్యక్షులు భగవాన్ రెడ్డి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అలీ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్ చంద్రశేఖర్ పురం రవి సత్యనారాయణ గౌడ్ రాహుల్ రెడ్డి కృష్ణారెడ్డి ఇంతకుముందు గీత స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ విజయభాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి సతీష్ చారి విట్టల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నారాయణ గుప్తా కలకల్ బంగారమ్మ దేవాలయంలో రాష్ట్ర సర్పంచుల పురం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తుఫాన్ సాయిబాబా ట్రస్టు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీలో పాల్గొని అనంతరం జరిగిన సన్మాన సభలో కేకును కట్ కట్ చేసి శాలువాతో సన్మానించారు
సామాజిక సేవలో ముందుండే వ్యక్తి నారాయణ గుప్తా




