మంత్రి అదేశాలతో మరిమడ్ల రోడ్డు పనుల ప్రారంభంకు పరిశీలన
రుద్రంగి ఆగస్టు 27 (జనం సాక్షి)
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మానాల నుండి మరిమడ్ల వరకు రోడ్డు పనులను సెప్టెంబర్ మొదటి వారంలో చేపట్టేందుకు పరిశీలించినట్లు ఆర్ అండ్ బి ఎస్సీ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు శనివారం మానాల ప్రజాప్రతినిధులతో కలిసి మరిమడ్ల రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రోడ్డు పనుల నిర్మాణంలో భాగంగా కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాల్కొండ సబ్ డివిజనల్ డి.ఈ రవీందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ పిసరీ భూమయ్య,రుద్రంగి తెరాస మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి,జేఈ నరసయ్య, మాజీ వైస్ ఎంపీపీ బాధనవేని రాజారం,మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యాంసుందర్,నాయిని రాజేశం, లక్కకుల స్వామి,మోహన్,గంగాధర్,మదన్ తదితరులు పాల్గొన్నారు.