Wednesday, 4 November 2026

మంత్రి కెటిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

మంత్రి కెటిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి

వారం రోజుల్లోపు నిధులు మంజూరు చేస్తామని మంత్రి కెటిఆర్ హామీ

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారిని సోమవారం నాడు ప్రగతి భవన్ లో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు కలిశారు, ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ను కోరినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు, నకిరేకల్ పట్టణంలో కాలంవారికుంట సుందరీకరణకు 4.64 కోట్లు, కడపర్తి డబల్ రోడ్డు నిర్మాణానికీ 2.94 కోట్లు, పట్టణంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికీ కోటి రూపాయలు, చిట్యాల మున్సిపాలిటిలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికీ కోటి రూపాయలు కేటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు, మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించి వారం రోజుల్లోపు నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి మీడియాకు వెల్లడించారు, మున్సిపాలిటీల అభివృద్ధితో పాటు, నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి కెటిఆర్ అన్నారని తెలిపారు..