మంత్రి జానాను అడ్డుకున్న మహిళలు
నల్లగొండ : రాష్ట్ర మంత్రి జానారెడ్డికి తన సొంత నియోజక వర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. అనుముల మండలం జానారెడ్డి కాలనీలోని మంచినీటి సమస్యను పరిష్కరించాలంటు మహిళలు మంత్రిని అడ్డుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ గ్రామంలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.