హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డితో శనివారం సచివాలయంలో తెలంగాణ ప్రాంత నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ అంశంపై హైకమాండ్ దృష్టి సారంచటం, చలో అసెంబ్లీ పరిణామాలపై వీరు చర్చ జరుపుతున్నారు. జానారెడ్డితో భేటీ అయినవారిలో పొన్నం ప్రభార్, పాల్వయి గోవర్ధన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉన్నారు.




