Tuesday, 3 November 2026

మత్స్యసంపదలో మనమే అగ్రస్థానం: సీఎం

అవనిగడ్డ: ఈ ఏడాది రూ. 11వేల కోట్ల అదాయంతో మత్య్స సంపదలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో నూతనంగా నిర్మించిన ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ…. దివిసీమలోని తీర ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఏటిమోగ -ఎదురుమొండి, ఉల్లిపాలెం-భవానీపురంల వద్ద కృష్ణానదిపై వంతెనలు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *