వరంగల్ ఈస్ట్, మే 03 (జనం సాక్షి) రంగసాయి పేట కాలనీస్ డెవలప్మెంట్ సొసైటీ గౌరవ అధ్యక్షులు రామానుజన్ జగదీశ్వర్ స్వామి అధ్యక్షులు కర్నె రవీందర్ ఆధ్వర్యలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు ని బుధవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా వివిధ కాలనీలోని సమస్యలకు చర్యలు తీసుకోవాలని అలాగే ఆర్టిఏ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు త్వరగా చేపట్టాలని ఆర్టిఏ జంక్షన్ వద్ద పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగినది. దీనికి సంబంధించిన వినతి పత్రం ఇవ్వడం జరిగినది స్పందించిన మంత్రి త్వరలో పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపినారు ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ అధ్యక్షులు అక్క పెళ్లి స్పందన పాకవెంకటేష్ సదానందం వేల్పులకొమురయ్య శ్రీనివాస్ గుప్తా రాంబాబు సాగర్వీర్య నాయక్ మహమ్మద్ రఫిక్ పిండి మల్లికార్జున్ రావుల బుచ్చయ్యతదితరులు పాల్గొన్నారు




