హైదరాబాద్: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాణిక్యవరప్రసాద్‌ను వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు అడ్డుకున్నారు. మంత్రి ఈరోజు రాజేంద్రనగర్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు అపార్డ్‌ను ముట్టడించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. లోనికి జొరబడి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.




