హైదరాబాద్: ప్రజాస్వామ్య స్ఫూర్తిలేని పార్టీ కాంగ్రెస్సేనని, వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేసింది. కాంగ్రెస్‌లో ఎవరినైనా విమర్శిస్తామని, నెహ్రూ కూడా అప్పటి ఆంధ్రా నేతల ఒత్తిడికి తలొగ్గి ఇష్టంలేని పెళ్లి చేశారిని ఆయన ఆరోపించారు. .జగన్ సోనియాను విమర్శిస్తే కాంగ్రెస్ నేతలకు నోరెందుకు పెగలదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కట్టలు తెంచుకోకముందే ఓ నిర్ణయానికి రావాలని, విభజనకు అంగీకరిస్తే ఎవరితోనైనా, ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ తెలియజేశారు.




