* ప్రధాన రహదారి సమస్యను త్వరగా పరిష్కరించాలి
* రోడ్డు వెడల్పులో ప్లాట్లు కోల్పోయే వారికి నష్టపరిహారం ఇవ్వాలి
* రోడ్డు నిర్మాణంలో నాణ్యత పరిణామాలు పాటించాలి
* అధికార పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
* సమస్యలపై బీఎస్పీ పార్టీ పోరాడుతుంది – జంగయ్య
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఆగస్టు 26 :- జవహర్ నగర్ ప్రధాన రహదారిపై జరుగుతున్న అనేకమైన రోడ్డు ప్రమాదాలు మంత్రి మల్లారెడ్డి చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనాలని మేడ్చల్ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు చీర్యాల జంగయ్య ధ్వజమెత్తారు మేడ్చల్ నియోజకవర్గం లోనే అత్యధిక ఓటరు మహాశయులు నివాసం ఉంటున్న ప్రాంతం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతమని మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రం క్యాబినెట్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే సువర్ణవకాశం కల్పించింది కూడా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన ప్రజలేనని గుర్తు చేశారు ప్రధాన రహదారి అభివృద్ధి పేరుతో గత సంవత్సరం నుండి మోకాళ్ళ లోతు గుంతలతో ప్రాణాంతకంగా తయారైన ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించి రోడ్డు సమస్య నుండి ప్రజలు విముక్తి కలిగించండి బాబోయ్ అని స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ప్రజలు ఓట్లతో గెలిచి గద్దెనెక్కి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా చలమనవుతున్న మంత్రి మల్లారెడ్డి తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాలకమండలి సభ్యులు చీమ కుట్టినట్టు కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని అన్నారు పాదచారులతోపాటు ద్విచక్ర వాహనదారుల నుండి మొదలుకొని భారీ వాహనదారులు ఎదుర్కొంటున్న రోడ్డు ప్రమాదాలను భరించలేక బాధితులు అసహనానికి లోనై అసభ్యకరమైన పదజాలాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ ప్రజాగ్రహానికి గురికాకుండా రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరిద్దాం అనే ఆలోచన వీరిలో కలుగకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు నిన్నటికి నిన్న ఒక చిరు వ్యాపారి ప్రధానంగా రోడ్డు బాగాలేని కారణంగా ఆటో బోల్తా పడి త్రుటిలో ప్రాణాపాయం నుండి బయట పడిన సంఘటన జవహర్ నగర్ ప్రజలందరూ గమనించారని ఇలా ఇంతకుముందు కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డితో పాటు అధికార పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా ఇలా రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి నష్టపరిహారం చెల్లిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లారెడ్డిని మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కొనసాగే అవకాశం ఇచ్చిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు నా గుండెకాయ లాంటి వాళ్లు అని నిత్యం డప్పు కొట్టుకునే మంత్రి మల్లారెడ్డికి తన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కు యూనివర్సిటీ హోదాను తీసుకురావడం పై ఉన్న శ్రద్ధ జవహర్ నగర్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు లేదని విమర్శించారు అలాగే ప్రధాన రహదారి రోడ్డు నిర్మాణంలో నాణ్యత పరిణామాలు పాటించడం లేదని కార్లు ఆటోలు గుద్దితేనే డివైడర్ గోడలు కూలుతున్న సందర్భాలు నాణ్యత లోపాలకు నిలువెత్తు నిదర్శనాలని అన్నారు రోడ్డు వెడల్పు విషయంలో రోడ్డు కటింగ్ విషయంలో నివాస స్థలాలతో పాటు నిర్మాణాలు కోల్పోయే వారికి నష్టం వాటిల్లకుండా తగిన పరిహారం చెల్లించాలని ఎవరిని భయభ్రాంతులకు గురి చేయవద్దని సూచించారు రోడ్డు వెడల్పు విషయంలో ఎవరిని భయభ్రాంతులకు గురి చేసిన వారికి తోడుండి పోరాడుతామని భరోసానిచ్చారు ఇకనైనా ప్రధాన రహదారి నిర్మాణం త్వరగా పూర్తిచేసి రోడ్డు సమస్య నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని లేనియెడల ప్రజలందరితో సమాయత్తమై ప్రధాన రహదారి సమస్యతో పాటు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై బి ఎస్ పి పార్టీ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతుందని హెచ్చరించారు




