Tuesday, 3 November 2026

మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరికలు

హైదరాబాద్‌,జూలై27(జ‌నం సాక్షి): నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని రాజన్నగూడెంకు చెందిన టీడీపీ,కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ ఇంచార్జీ నోముల నర్సింహులు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో వీరంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలందరికీ మంత్రి జగదీశ్‌రెడ్డి.. గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి.. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో సాగర్‌ ఎడమ కాల్వకు నీళ్లు ఇవ్వలేదు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక టెల్‌ఎండ్‌ వరకు నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. సాగర్‌ కింద చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. కాంగ్రెస్‌ 60 ఏళ్లు పాలించి.. కనీసం కాలువ పక్కన ఉన్న రైతులకు నీళ్లు ఇవ్వలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.