విజయనగరం,జూలై27(జనం సాక్షి): గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి పంచాయతీ వండిడి గ్రామాన్ని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జిపి స్కూల్, అంగన్వాడీ సెంటర్‌లను తనిఖీ చేశారు. అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగ్, గృహాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.




