Thursday, 5 November 2026

మంత్రి సునీతా లక్ష్మారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు

సంగారెడ్డి, నవంబర్‌ 12 (ఎపిఇఎంఎస్‌): చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్‌ జిల్లా ప్రజలందరికి గౌరవ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నెల 13న జరుపుకుంటున్న దీపావళి పండుగ మెదక్‌ జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులునింపాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *