హైదరాబాద్,జూలై7(జనం సాక్షి):తెలంగాణ బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్,బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న వీరందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు ఎంతో ఆకర్షితులమై తాము టీఆర్‌ఎస్ లో చేరుతున్నామని చెప్పారు.




