మంథని నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీకి సిద్ధం
జనంసాక్షి, మంథని : రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నందున మంథని నియోజకవర్గంలో జనసేన పార్టీ సిద్ధంగా ఉందని మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మాయ రమేష్ అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో 32 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నదని, అలాగే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సైతం మంథని లో ఉంటుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మంథని మండలం అధ్యక్షుడు ఈరవేన ఓంప్రకాష్ , కాటారం మండల అధ్యక్షులు జనాగం పవన్ , మంథని మండల వైస్ ప్రెసిడెంట్ మెరుగు సునీల్ ,మేకల శ్రవణ్ ,కాసు రంజిత్, అనుమాల వినయ్, మనోజ్ , దొగ్గేలా సాయికిరణ్ , అభిషేక్, అరిగల వెంకటేష్, శశి ,సర్వేశ్ తదితరులు పాల్గొన్నారు




