Tuesday, 3 November 2026

మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేత

మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేత

చిన్నంబావి అక్టోబర్ 5 జనం సాక్షి

చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన మేకల రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు నిన్న రాత్రి 11 గంటల సమయం లో మృతి చెందాడు. అతని భౌతిక కాయని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ భర్త వెంకట్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. అతని కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆ కుటుంబానికి మేకల రాజు చనిపోవడం తీరని లోటు అని కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలియజేస్తే ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని 10,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు శ్రీధర్ రెడ్డి నుంచి అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు శ్రీదర్ రెడ్డి, ముష్టి తిరుపల్ యాదవ్, యూత్ నాయకులు ఈటిక్యాల మహేష్, మధుగని మహేష్, సంపంగి నరహరి, బొల్లారం సురేష్, మినిగ మహేష్, ఈటిక్యాల పరమేష్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.